99TV News

    రవితేజ తమ్ముడి కొడుకు హీరోగా 'మారెమ్మ'.. క్లైమాక్స్ చూసి రవితేజ ఎమోషనల్

    రవితేజ తమ్ముడి కొడుకు హీరోగా 'మారెమ్మ'.. క్లైమాక్స్ చూసి రవితేజ ఎమోషనల్

    “ఓ కథకి ఏం కావాలో అది చేసుకుంటూ వెళ్తే ప్రతి సినిమా ఓ బ్లాక్బస్టరే. 'మారెమ్మ'లో ఆ అంశాలన్నీ బాగా కుదిరాయి” అని ప్రముఖ దర్శకుడు శివ నిర్వాణ అన్నారు. మాస్ మహారాజా రవితేజ సోదరుడు రఘు కుమారుడు మాధవ్ భూపతి రాజు హీరోగా పరిచయమవుతున్న చిత్రమే 'మారెమ్మ'. మంచాల నాగరాజ్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని మయూర్ రెడ్డి బండారు నిర్మించారు. దీపా బాలు కథానాయికగా నటిస్తుండగా.. వినోద్ కుమార్, వికాస్ వశిష్ఠ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే మంగళవారం హీరో రామ్ ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. అనంతరం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దర్శకుడు శివ నిర్వాణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

    శివ నిర్వాణ ప్రశంసలు & ట్రైలర్ హైలైట్స్:

    ఈ సమావేశంలో దర్శకుడు శివ నిర్వాణ మాట్లాడుతూ.. “ఓ సినిమా బ్లాక్‌బస్టర్ కావడానికి అవసరమైన అన్ని రకాల కమర్షియల్, ఎమోషనల్ అంశాలు ఇందులో ఉన్నాయ టూ చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే దర్శకుడు నాగరాజ్ మాట్లాడుతూ.. “ఈ ట్రైలర్‌కి పదిరెట్లు సినిమా ఉంటుంది. ముఖ్యంగా సినిమాలోని చివరి 20 నిమిషాలు ప్రేక్షకుల రోమాలు నిక్కబొడుచుకునేలా రోమాంచితంగా ఉంటుంది” అని ధీమా వ్యక్తం చేశారు.

    మనిషికి, దున్నపోతుకి మధ్య బంధం: హీరో మాధవ్

    ఈ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇస్తున్న మాధవ్ భూపతి రాజు మాట్లాడుతూ.. “సాధారణంగా సినిమాల్లో ఇద్దరు మనుషుల మధ్య బంధం చూస్తుంటాం. కానీ, ఈ సినిమాలో ఒక మనిషికి, ఓ దున్నపోతుకి మధ్య ఉండే అన్యోన్యమైన అన్నదమ్ముల బంధాన్ని చూస్తారు. మా పెదనాన్న రవితేజ గారు ఈ సినిమా చూశారు. ఆయనకి సినిమాలోని క్లైమాక్స్ చాలా నచ్చింది. సినిమా చూశాక తనెంతో భావోద్వేగానికి గురయ్యారు” అని పంచుకున్నారు.

    ఈ కార్యక్రమంలో హీరో మాధవ్‌తో పాటు హీరోయిన్ దీప, నిర్మాత మయూర్, నటుడు వికాస్ వశిష్ఠ తదితరులు పాల్గొన్నారు. విభిన్నమైన కథాంశంతో వస్తున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి!